థ‌ర్డ్ వేవ్ వ‌స్తే ఎదుర్కొనేందు సోనూసూద్ ప్ర‌ణాళిక‌లు…

ఇప్పుడు ఎక్క‌డ చూసిన కొవిడ్ మ‌హ‌మ్మారి క‌ర‌ళ‌నృత్యం చేస్తుంది. క‌రోనా సెకండ్ వేవ్ రావ‌డంతో ప్ర‌జ‌లు ప‌ట్టిల్లా రాలిపోతున్నారు. క‌ళ్ల‌ముందే అయిన‌వారిని కోల్పోతున్నా ..ఏం చేయ‌లేక నిస్సహాయ స్థితిలో కుటుంబ స‌భ్యులు ఉండి పోవాల్సిన ప‌రిస్థితి దారుణాతి దారుణం.మొద‌టి వేవ్ వ‌చ్చిన‌ప్పుడు కొంచెము ప‌ర్వ‌ధులేదు. కొవిడ్ సెకండ్ వేవ్ మాన‌జాతిన్ని తుదముంటించాడానికి వ‌స్తోంద‌న్నిపిస్తోంది.సెకండ్ వేవ్ దెబ్బ‌కి హాస్పిటేల్సే కాదు శ్మ‌శానాలు కూడా ఖాళీలేకుండా పోయాయి. మ‌రి సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉంటే. ప్ర‌స్తుతం థ‌ర్డ వేవ్ వ‌స్తే ప‌రిస్థితి ఏంటి? ఊహిస్తుంటేనే భ‌య‌క‌రంగా ఉంది క‌దా. అందుకే థ‌ర్డ్ వేవ్ అంటూ వ‌స్తే… ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వాలు ఏమో గానీ… ప్ర‌జ‌ల మ‌నిషిగా, ఆప‌ద్భాంధ‌వుడిగా పేరు తెచ్చుకున్న ,ప్ర‌జ‌లు దేవుడిగా భావిస్తోన్న సోనూసూద్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. సెకండ్ థ‌ర్డ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ పాత్ర మ‌రింత‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని భావించి..కొవిడ్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ను నెల‌కొల్పాల‌నే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ఫ్రాన్స్ నుండి ఓ ప్లాంట్ కి ఆర్డ‌ర్ చేశామ‌ని.. మ‌రో 10-12 రోజులలో అక్క‌డ నుండి ఆక్సిజ‌న్ ప్లాంట్ రాబోతున్న‌ట్లుగా సోనూసూద్ తెలిపారు. అలాగే ఇంకొన్ని దేశాల నుండి ప్లాంట్‌ల‌ను కొనుగోలు చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లుగా సోనూ ప్ర‌క‌టించారు. ఇప్పుడు స‌మ‌యం అనేది అతి పెద్ద స‌వాలుగా మారింది. ప్ర‌తీది స‌మ‌యానికి అందించేలా .మావంతుగా ఎంత‌గానో కృషి చేస్తున్నాము. ఇక మ‌న ప్రాణాల్ని కాపాడుకోగ‌లం.. అని సోనూసూద్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *