ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో అంటే కొత్త క‌థే కావ‌చ్చు…

టాలీవుడ్ అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌య్య త‌న ఆల్ టైం బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నుతో ఒక ప‌వ‌ర్‌పుల్ మాస్ హ్యాట్రిక్ మూవీన్ని చేస్తున్నారు. అలాగే దీనిపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల కాబ‌డ్డ టీజ‌ర్ తో మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఇక ఇదిలా ఉండే బాల‌య్య మ‌రిన్ని మూవీల‌ను లైన్ లోపెడుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌తో పాటుగా యంగ్ అండ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌కు కూడా బాలయ్య అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. అలా ఇప్పుడు బాల‌య్య ఓ సినిమాన్ని ఓకే చేశార‌ట‌. దానిపై స‌రైన క్లారిటీ లేదు కానీ అందులో బాల‌య్య‌తోపాటుగా లేటెస్ట్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య కూడా న‌టిస్తాడ‌ని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ మూవీని ఒక యువ మరియు కొత్త ద‌ర్శ‌కుడు ప‌ని చేస్తాడ‌ని స‌మాచారం.మ‌రి ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో అంటే కొత్త క‌థే కావ‌చ్చు. ఇక ఇది ఏమైన‌ప్ప‌టికీ మాత్రం దీనిపై మ‌రింత స‌మాచారం రావాల్సిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *