కొత్త మూవీలో ప‌వ‌న్ కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా క‌నిపిస్తార‌ట‌.

టాలీవుడ్ అగ్రహీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం బండ్ల గ‌ణేష్‌, ప్ర‌స్తుతం క‌థ‌ను వెతికే ప‌నిలో ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఓ త‌మిళ యువ ర‌చ‌యిత ద‌గ్గ‌ర ,బండ్ల ఒక క‌థ‌ను ఓకే చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చినా అది నిజంగా కాదు అని తేలిపోయింది. అయితే ర‌చ‌యిత కోన వెంక‌ట్ త్వ‌ర‌లో ప‌వ‌న్‌కు ఓ క‌థ వినిపించ‌నున్నార‌ట‌. క‌థ‌లో ప‌వ‌న్ పాత్ర కాస్త కొత్త‌గా ఉంటుంద‌ని.కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా ప‌వ‌న్ మూవీలో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. మ‌రి కాలేజీ నేప‌థ్యంలో మూవీ అంటే.. అది ప‌వ‌న్ లెక్చ‌ర‌ర్ పాత్ర అంటే… ఆస‌క్తి రెట్టింపు అయ్యేలా ఉంది. మొత్తానికి బండ్ల‌కు ప‌వ‌ర్‌స్టార్ ఎట్ట‌కేల‌కూ మ‌ళ్లీ ఓ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశం ఇచ్చాడు. ఆ మాట‌కొస్తే ఎప్ప‌టి నుండో బండ్ల‌కు ప‌వ‌న్‌తో మ‌ళ్లీ మ‌రోమూవీ చేయాల‌ని ఉంది. కానీ కుద‌ర‌లేదు.వ‌చ్చే సంవ‌త్స‌రం వీరి క‌ల‌యిక‌లో మూవీ రాబోతుంది. మ‌రి ఎలాంటి చిత్రం రాబోతుందో చూడావ‌ల్సిందే….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *