విజ‌య్ స‌ర‌స‌న ర‌ష్మిక మందాన్న‌…

తెలుగు ఇండ‌స్ట్రీలో వ‌రుస విజ‌యాలు అందుకొని ముందు దూసుకుపోతున్న ముద్దుగుమ్మ ర‌ష్మిక‌మందాన ఈ బ్యూటీ కేవ‌లం తెలుగులోనే కాక త‌మిళం, హిందీ మూవీల్లోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ కోలీవుడ్ లెజండ్ స్టార్ అయిన విజ‌య్‌తో న‌టించాల‌ని ర‌ష్మిక ఎప్ప‌టినుంచో అనుకుంటోంది. ఇంత‌క‌ముందు అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోయింది. ఎట్ట‌కేల‌కు తాజాగా ఆఛాన్స్ రష్మిక‌క‌ను వ‌రించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. నెల్స‌న్‌దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఓ మూవీ చేయ‌బోతున్నాడు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో హీరోయిన్‌గా ర‌ష్మిక‌ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. త‌మిళంతోపాటు తెలుగులోనూ ర‌ష్మిక‌కు క్రేజ్ ఉండ‌డంతో ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ విష‌య‌మై అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతోంద‌ట‌. ర‌ష్మిక త‌మిళంలో న‌టించిన తొలి మూవీ సుల్తాన్ ఏప్రిల్2న విడుద‌ల కానుంది. ఈ మూవీతో పాటు హిందీలో మిష‌న్ మ‌జ్ను మూవీను తెర‌కెక్కిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *