ప్ర‌స్తుతం కెరీర్ ప‌ట్ల చాలా సంతోషంగా ఉన్నా.అని చెప్పింది…..

ప‌లు భాష‌ల‌లో న‌టిస్తూ ప‌ర‌స్ప‌ర విశ్వాసం, నిజాయితీ లేని చోట ప్రేమ‌బంధాలు విచ్చిన్నమ‌వుతాయ‌ని చెప్పింది అగ్ర‌క‌థానాయిక న‌య‌న‌తార‌. విఫ‌ల ప్రేమ‌లు జీవితంలో ఎన్నోగుణ‌పాఠ‌లు నేర్పించాయ‌ని, త‌న వ్య‌క్తిత్వాన్ని మ‌రింత దృఢంగా తీర్చిదిద్దాయ‌ని ఆమె పెర్కొంది. న‌య‌న‌తార మాట్లాడుతూ.. న‌మ్మ‌కంలేని చోట ప్రేమ‌ను ఆశించ‌డం మూర్ఖ‌త్వం అవుతుంది. క‌లిసి ప్ర‌యాణించ‌డంలోని ఆనందం కంటే ఒంట‌రిగా ఉండ‌టంలో ఎక్కువ మ‌న‌శ్శాంతి ల‌భించిన‌ట్ల‌యితే ఆ బంధానికి వీడ్కోలు ప‌ల‌క‌డ‌మే మంచిది. క‌లిసి న‌డిచే అడుగులు భారంగా తోస్తున్న‌ప్పుడు స్వేచ్చ‌గా ప‌య‌నించే దారిని ఎంచుకోవాలి. నా జీవితంలో అదే చేశాను. ప్ర‌స్తుతం కెరీర్ ప‌ట్ల చాలా సంతోషంగా ఉన్నా.అని చెప్పింది. న‌య‌న‌తార గ‌తంలో శింబు,ప్ర‌భుదేవాతో విఫ‌ల‌ప్రేమాయ‌ణాలు న‌డిపిన న‌య‌న‌తార ఇప్పుడు త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌శివ‌న్‌తో ప్రేమ‌లో ఉంది. ఈ జంట త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌బోతున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. మ‌రోవైపు వ‌రుస‌గా భారీ మూవీల్లో న‌టిస్తూ లేడిసూప‌ర్‌స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *