ప్ర‌భాస్ బైక్ మెకానిక్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌….

బాహుబ‌లి మూవీ ద్వారా ప్ర‌పంచానికి ప‌రిచ‌మైన మ‌న హీరో ప్ర‌భాస్‌. ఇప్పుడు వెంట‌నే వెంట‌నే మూవీలు చేస్తున్నారు.రాధేశ్యామ్ షూటింగ్ ముగిసిన వెంట‌నే కె.జి.య‌ఫ్‌ డెరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్లో విజయ్ కిర‌గందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా స‌లార్.. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈమ‌ధ్య‌కాలంలో సింగ‌రేణిలో స్టార్ట్ అయ్యింది. షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టినుంచి స‌లార్ సెట్స్ పిక్స్ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మ‌రో ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈపిక్‌లో ప్ర‌భాస్ బొగ్గు గునుల్లో బుల్లెట్ న‌డుపుతూ క‌నిపించాడు. ప్ర‌భాస్ బైక్ మెకానిక్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. క‌న్న‌డ‌లో ప‌లు మూవీల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న యువ న‌టుడు మ‌ధు గురుస్వామి
ఈ మూవీలో విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. మిగ‌తా పాత్ర‌ల్లో దాదాపు కొత్త న‌టీన‌టులు క‌నిపించ‌బోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *