సూర్య మ‌ల్టీస్టార‌ర్ మూవీ….

హీరో సూర్య ద‌ర్శ‌కుడు, క‌థ‌ను బ‌ట్టి ప్ర‌యోగాలు చేయ‌డానికి రెడీ అవుతుంటాడ‌నే సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా ఆకాశం నీ హ‌ద్దురా సినిమాతో సెన్సేష‌న‌ల్ హిట్ సొంతం చేసుకున్న హీరోసూర్య ఇప్పుడు గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ణిర‌త్నం నిర్మిస్తోన్న న‌వ‌ర‌స అనే వెబ్‌సిరీస్‌లో న‌టిస్తున్నారు. కాగా దీంతో పాటు వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వాడివ‌స‌ల్ సినిమాతో పాటు పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. అయితే లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆర్య‌, అథ‌ర్వ‌ముర‌ళిల‌తో క‌లిసి సూర్య ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో యాక్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాను విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు బాలా తెర‌కెక్కిస్తున్నారు. బాలాతో ఉన్న ప‌రిచ‌యం కార‌ణంగా సూర్య ఈ సినిమాలో న‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కోలీవుడ్ వ‌ర్గాల టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *