థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ మిస్ట‌రి ఏంటీ -సాయితేజ్‌

టాలీవుడ్ యంగ్‌హీరో ద‌గ్గుపాటి రానా థ్యాంక్యూబ్ర‌ద‌ర్ అంటూ ఓ వీడియోని షేర్ చేసిన విష‌యం తెలిసిందే. అందులో షూటింగ్ చేస్తున్న‌వారు ఎవ‌రైనా మాస్క్ పెట్టుకోక‌పోతే వెంట‌నే మాస్క్ పెట్టుకోమ‌ని ఎదుటి వ్య‌క్తి చెప్ప‌డం. అందుకు ఆ వ్య‌క్తి థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ అని చెప‌డం.. ఇలా ఆ వీడియో అంతా థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌ల‌ని వినిపించింది. అయితే ఇది కావాల‌ని చేసిన వీడియో కాద‌ని, ఓ మూవీ కోస‌మ‌ని త‌రువాత రోజు తెలిసింది. క‌రోనా కాలానికి సంబంధించిన క‌ల్ప‌నిక ఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకొని క్రియేటివ్ జీనియ‌స్ అయిన ర‌మేష్ రాప‌ర్తి,థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ మూవీన్ని రూపొందిస్తున్నట్లుగా చెబుతూ టైటిల్ లుక్‌ని రానా విడుద‌ల చేశారు. రానా త‌రువాత ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తికి, చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. యంగ్ రెబ‌ర్‌స్టార్ ప్ర‌భాస్ త‌న ఫేస్ బుక్‌లో ఈ పోస్ట‌ర్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు సాయితేజ్ వంతు వ‌చ్చింది. ఈ థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ మిస్ట‌రీ ఏంటీ? ఈ టైటిల్ వెనుక ఉన్న లిప్ట్‌లో ఎవ‌రున్నారు.? అనేది సుప్రీమ్ హీరో సాయితేజ్ రివీల్ చేయ‌బోతున్నారు. న‌వంబ‌ర్‌27 సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ స‌స్పెన్స్‌న్న ఈ మూవీలో అశ్విన్ విరాజ్ ఓ కిల‌క పాత్ర పోషిస్తున్నారు. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర్మాణ‌మ‌వుతున్న ఈ మూవీన్ని మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *