విజ‌య్ దేవ‌రకొండ కొత్త మూవీ పై ఫోక‌స్‌…..

ప్ర‌స్తుతం యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తో క‌లిసి ఓ మూవీ చేయ‌నున్నాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ త‌రువాత ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డుతుందా..? లేదా అంటూ అనుమానాలు మొద‌ల‌య్యాయి. తాజాగా మ‌ళ్లీ ఈ మూవీన్ని సంబంధించిన వార్త ఫిలింగ‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. విజ‌య్ ఇత‌ర క‌మిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండ‌టంతో ఈ మూవీ ఇప్ప‌ట్లో లేన‌ట్టేన‌ని వార్త‌లు రాగా శివ నిర్వాణ మాత్రం 2021 జ‌న‌వ‌రి లోసెట్స్ పైకి వెళ్తుంద‌ని చెప్తున్నాడు. ప్ర‌స్తుతం ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంలో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ‌. డిసెంబ‌ర్ చివ‌ర‌క‌ల్లా షూటింగ్ పూర్తి చేస్తే..విజ‌య్ మూవీపై ఫోక‌స్ పెట్ట‌నున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయ‌ని త్వ‌ర‌లోనే హీరోయిన్ ఎవ‌ర‌నేది కూడా త్వ‌ర‌లోనే చెప్ప‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లోఫైట‌ర్ మూవీ చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *