డ‌బుల్ డోస్ (ఢీ ఢీ) అనే టైటిల్ ఫిక్స్‌….

డైరెక్టర్ శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్‌లో మరో సినిమా సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఢీ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు కెరీర్‌లో ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సినిమాను కూడా శ్రీను వైట్లే రూపొందిస్తున్నారు.ఈ సినిమాకు డబుల్‌ డోస్‌ (ఢీఢీ) అనే టైటిల్‌ను నిర్ణయించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను ట్విటర్ ద్వారా మంచు విష్ణు విడుదల చేశాడు. పెద్దన్నయ్య శ్రీను వైట్లతో మరోసారి సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉందని పేర్కొన్నాడు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్‌తో కలిసి మోసగాళ్లు సినిమాలో నటిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *