శంక‌ర్, రామ్‌చ‌ర‌ణ్ మూవీ ప్రాజెక్ట్‌పై బిగ్గేస్ట్ అంచ‌నాలు…

టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో తాజాగా మ‌న ద‌క్షిణాది నుంచి అనౌన్స్ కాబ‌డ్డ సెన్సేష‌న్ ప్రాజెక్ట్ ఏద‌న్నా ఉంది అంటే అది శంక‌ర్ మ‌రియు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ల‌దే అని చెప్పాలి. వీరి క‌ల‌యిక‌లో నుంచి మూవీ అనౌన్మ్సెంట్ రాగానే అంచ‌నాలు మ‌రో స్థాయికి వెళ్లాయి. దీనితో పాన్ ఇండియ‌న్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ మోత మోగించే ప్రాజెక్ట్ ఒక‌టి రాబోతుంది అని అర్ధం అయ్యింది. మ‌రి ఇదిలా ఉండ‌గా ఈభారీ ప్రాజెక్ట్‌పై మ‌రిన్ని బ‌జ్‌లు విపిస్తున్నాయి. మ‌రి ఆబ‌జ్ ప్ర‌కార‌మే ఈ మూవీకి సెన్సేష‌న‌ల్ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ సంగీతం ఇస్తాడాని తెలుస్తుంది. ఇప్ప‌టికే శంక‌ర్‌తో భార‌తీయుడు2 కుప‌నిచేస్తున్న అనిరుధ్ మ‌ళ్లీ సంగీతం అందివ్వ‌నున్న‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో కాల‌మే నిర్ణయించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *