బీచ్ వేదిక‌గా డిస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌న్న‌దట‌….

టాలీవుడ్ అందాల భామ ప్ర‌స్తుతం వివాహ వ్య‌వ‌స్థ‌పై త‌న‌కు ఎంతో గౌర‌వముంద‌ని చెప్పింది. పంజాబీ సొగ‌స‌రి ర‌కుల్ ప్రీత్ సింగ్. త‌న‌కు కాబోయేవాడు అన్ని సంగ‌తుల‌లో ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఉండాల‌ని పేర్కొంది. ఇటీవ‌లే ఈ భామ ఓ ప్ర‌ముఖ వెడ్డంగ్ మ్యాగ‌జైన్ ముఖ్య‌చిత్రంపై ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ సంద‌ర్భంగా త‌న‌తో ఏడ‌డుగులు న‌డిచే వాడు ఎలా ఉండాలో వివ‌రిస్తూ జీవితంలో ఓ నిర్ధ‌ష్ట‌మైన లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాఫ‌ల్యంకోసం నిరంత‌రం త‌పించే వ్య‌క్తిగా నాభాగ‌స్వామిగా కోరుకూంటా. అత‌ను ఏ విష‌యంలోనూ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌కుండా చురుగ్గా నిర్ణ‌యాలు తీసుకునే వ్య‌క్తిత్వం క‌లిగి ఉండాలి. నేను సైనిక నేప‌థ్య‌మున్న కుటుంబం నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో ఏమాత్రం రాజీప‌డ‌ను, అని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి వేడుక విష‌యంలో త‌న‌కు ఆడంబరాలు అంత‌గా ఇష్టం ఉండ‌వ‌ని.. ఓవంద‌మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో బీచ్ వేదిక‌గా డిస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌న్న‌ది. త‌న అభిమ‌త‌మ‌ని చెప్పింది. ప్ర‌స్తుతం ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగులో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీతో పాటు నితిన్ స‌ర‌స‌న చెక్ మూవీలో న‌టిస్తుంది. హిందీలో మేడే ,అటాక్ అనేసినిమాలో న‌టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *