మహేష్ మాస్ సాంగ్‌తో మ‌ళ్ళి మెస్మ‌రైజ్ చేసిన వార్న‌ర్‌…‌

టాలీవుడ్ అగ్ర హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న మూవీల నుంచి వీడియోస్ తో కూడా వార్నర్ అద‌ర‌గొట్టాడు. క‌రోనా మ‌మ్మాహ‌రి వ‌చ్చిన‌ప్పుడు మొత్తం దేశాల్లోని లాక్ డౌన్ ప్ర‌క‌టించారు అంద‌రికి తెలిసిన విష‌య‌మే. అలాంటి త‌రుణంలో మ‌న తెలుగు టాప్ హీరోల మూవీల టిక్ టాక్ వీడియాస్ తో ఎంత‌లా ర‌చ్చ చేసాడో తెలిసిందే. అంతేకాకుండా ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక త‌న‌కి మ‌న తెలుగులో ఫేవ‌రెట్ హీరో ఉన్నారు అంటే అది మ‌హేష్ బాబే అని కూడా సెల‌విచ్చారు. అయితే అప్పుడు మైండ్ బ్లాక్ సాంగ్‌తో మెస్మ‌రైజ్ చేసిన వార్న‌ర్ ప్ర‌స్తుతం మ‌హేష్ చేసిన మ‌హ‌ర్షి లో మ‌రో మాస్ సాంగ్ పాల పిట్ట సాంగ్ లోని ఓ బిట్ తో వీడియో చేసి త‌న సోష‌ల్ మీడియాలో వ‌దిలాడు. ఆస్ట్రేలియ‌న్ డాషింగ్ మెన్ డేవిడ్ వార్న‌ర్ ఇటీవ‌ల మ‌రి దీనికి మ‌ళ్ళి మంచి రెస్పాన్స్ మ‌హేష్ ఫ్యాన్స్ నుంచి వ‌స్తుంది. మ‌రి వార్న‌ర్ నుంచి మున్ముందు ఇంకెలాంటి వీడియోలు వ‌స్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *