సంక్రాంతి రేస్‌లో క్రాక్ మూవీ విడుద‌ల‌…….

టాలీవుడ్ అగ్ర హీరో మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ప‌వ‌ర్‌పుల్ మాస్ పోలీస్ గా క్రాక్ మూవీలో క‌నిపించ‌డాట‌.త‌న హిట్ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ర‌వితేజ లాస్ట్ మూవీ ప్లాప్ అయిన‌ప్ప‌టికీ దీనిపై మ‌రిన్ని అంచ‌నాలు నెలకొన‌డం విశేషం. అయితే ఈ మూవీన్ని మేక‌ర్స్ ఎప్పుడో థియేట‌ర్స్ లోనేవిడుద‌ల చేస్తామ‌ని చెప్పేసారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే మిగిలి ఉన్న కాస్త షూట్ ను ఫినిష్ చేసేసి ఓ రిలీజ్ డేట్ ను అనుకున్నారు. దానికే ఇప్పుడు ద‌ర్శకుడు గోపీచంద్ మ‌లినేని రివీల్ చేసేసారు. ఈ మూవీ వ‌చ్చే సంవ‌త్స‌రం సంక్రాంతి రేస్‌లో జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా డేట్ ను లాక్ చేసేసారు. సో మాస్ మ‌హారాజ్ ఫ్యాన్స్ అప్ప‌టికి రెడీ అయిపోవాల్సిందే ఇక‌. ఈ మూవీలో మ‌రోసారి ర‌వితేజ స‌ర‌స‌న శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *