క‌ష్ట‌కాలాన్ని విశ‌దీక‌రిస్తూ ప్ర‌తీ ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలి..

ఇప్పుడు దేశం మొత్తం కొవిడ్ వైర‌స్ విజృంభిస్తోందని తెలిసిన విష‌య‌మే. ఇలాంటి రోజులు మ‌ళ్ళీ రాకూడ‌దు అని స‌మ‌స్త మాన‌వాళి ఎంతో గాఢంగా కోరుతుంది. గ‌త సంవ‌త్స‌రం క‌రోనా వ‌ల‌న అనేక కుటుంబాలు చిన్న‌భిన్న‌మైన‌వి, ఆర్థికంగా న‌ష్టాపోయారు. అనేక క‌ష్టాల‌ను ఎదుర్కొన్నారు. మాన‌వుని నిర్ల‌క్ష్యం వ‌ల‌న మ‌ళ్ళీ కొవిడ్ క‌ర‌ళ‌నృత్యం చేస్తుంది. దీనితో ఇప్ప‌టికే అనేక మంది ఇత‌రుల క‌ష్టాన్ని త‌మ క‌ష్టంగా భావించి సాయం చేస్తున్నారు. అలాగే మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ నుండి కూడా అనేక పెద్ద నిర్మాణ సంస్థ‌లు స‌హా చిత్ర యూనిట్స్ కూడా త‌మ వంతు సహాయం చైత‌న్యం అందిస్తున్నాయి. వాటిలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ ఆర్ఆర్ యూనిట్ కూడా ఒక‌టి. మ‌రి ఇదిలా ఉండ‌గా గ‌త సంవ‌త్స‌రం లోనే మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌రియు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌తో అద్భుత సందేశాన్నివారు అందించారు. కానీ ఈసారి మ‌రింత వినూత్న తారక్‌, చ‌ర‌ణ్ ల‌తో స‌హా బాలీవుడ్ స్టార్స్ ఆలియాభ‌ట్‌,అజ‌య్‌దేవ్‌గ‌న్ ల‌తో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కూడా అద్భుత సందేశాన్ని మొత్తం దేశ‌మంత‌టికీ ఒకేసారి ఇచ్చారు. ఒక్కొక్క‌రూ ఒక్కో భాష‌లో ఇప్పుడు క‌ష్ట‌కాలాన్ని విశ‌దీక‌రిస్తూ ప్ర‌తీ ఒక్కరూ వాక్సిన్ వేయించుకొని మ‌న కుటుంబీక‌లు, స్నేహితులు దేశాన్ని కాపాడుకోవాల‌ని సందేశం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *