కుమారుడిని అన్ ఫాలో చేసిన చిరు….

టాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరు ఈ సంవ‌త్స‌రం మార్చిలో ఉగాది సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఖాతాలు తెరిచిన విష‌యం తెలిసిందే. ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా త‌న‌కు సంబంధించిన అప్ డేట్స్ , ఇత‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంటున్నారు. బిజీ షెడ్యూల్ లోనూ అప్పుడ‌పుడు అభిమానుల‌ను ప‌లుక‌రిస్తున్నాడు. చిరు సోష‌ల్‌మీడియాకు దూరంగా ఉండే రాంచ‌ర‌ణ్ కూడా గ‌తేడాది ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచాడు. ఇటీవ‌లే రాంచ‌ర‌ణ్ ను ఫాలో అవ‌డం మొద‌లుపెట్టిన చిరంజీవి ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ అన్ ఫాలో చేశాడు. ఈ విష‌యంపై ఇప్ప‌డు జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. కుమారుడిని అన్ ఫాలో చేసిన చిరంజీవి ఇప్పుడు ఫాలో అవుతున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా. టాలీవుడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి .ఈ స‌వంత్స‌రం స‌రిలేరునీకెవ్వ‌రు మూవీతో హిట్టు కొట్టిన అనిల్‌రావిపూడిని ఫాలో అవుతుండ‌టంతో .. చిరు ఈ డైరెక్ట‌ర్ తో మూవీ చేస్తున్నాడా? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి మాత్రం 821.9k ఫాలోవ‌ర్ల‌తో త‌న అభిప్రాయాల‌ను షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *