చిరు ఫ్యామిలీ ఫోటో సూపర్‌గా ఉంది…

టాలీవుడ్ అగ్ర‌హీరో చిరంజీవి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ బెంచ్ మార్క్ సెట్ చేసుకున్న చిరు రీఎంట్రీలోనే దుమ్మ‌రేపుతున్నాడు. ఇక ఆయ‌న వార‌సుడిగా సీని ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చ‌ర‌ణ్ కూడా స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ అనే మూవీతో బిజీగా ఉన్నాడు.ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించ‌నున్నాడు. చిరంజీవి,సురేఖ దంప‌తుల‌కి కొడుకు రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రు కూతుళ్లుసుస్మిత‌, శ్రీ‌జ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ముగ్గురికి పెళ్లిళ్లు కాగా వారు వైవాహిక జీవితాన్ని చ‌క్క‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చిరంజీవి త‌న పిల్ల‌ల‌తో పాటు సతీమ‌ణితో క‌లిసి దిగిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇటీవ‌ల కాలంలో దిగిన ఫొటో అని తెలుస్తుండా, మెగా అభిమానులు దీనిని చూసి తెగ మురిసిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *