ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్ర‌భుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ క‌నిపిస్తార‌ట‌.

టాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి మ‌రియు డైరెక్ట‌ర్ కొర‌టాల‌శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్నా మూవీ ఆచార్య కాగా తాజాగా ఈ మూవీ కోసం సార‌థి స్టూడియోలో ఓ పురాత‌న దేవాలం సెట్ వేశార‌ని.. రేప‌టి నుండి ఆ సెట్ లో మెగాస్టార్ పై సాంగ్స్ షూట్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక మెగా మూవీ కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలోని దేవాల‌యాలు మ‌రియు అనేక ఇత‌ర మ‌త‌ప‌ర‌మైన కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్ర‌భుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ మూవీలోక‌నిపిస్తార‌ట‌. ఈ మూవీలో మెగాస్టార్ స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమె ఈ మూవీలోఒక జ‌ర్న‌లిస్ట్‌గా న‌టిస్తోందని తెలుస్తోంది. మెగాస్టార్ ఈ మూవీ కోసం బ‌రువు త‌గ్గ‌డంతోపాటు లుక్ కూడా చేంజ్ చేయ‌డం ఆస‌క్తి రేపుతోంది. అలాగే రామ్‌చ‌ర‌ణ్ మాజీ న‌క్స‌లైట్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌న అలాగే ఈ మూవీలో రెజీనా ఓ స్పెష‌ల్ సాంగ్ క‌నిపించ‌నుంది. కొణిదె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లోరామ్‌చ‌ర‌ణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *