వ‌రుణ్‌కి స‌రిజోడి కాదా అన్న‌దే చూస్తాం..

టాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్‌తేజ్ పెళ్లి కూడా ఉంటుంద‌ని నాగ‌బాబు గ‌తంలో చెప్పిన నేప‌థ్యంలో ,వ‌రుణ్ కూడా త్వ‌ర‌లో పెళ్లి కొడుకు కాబోతున్నాడ‌న్న పుకార్లు మొద‌ల‌య్యాయి.నాగబాబు కూతురు నిహారిక పెళ్లి టాక్ ఆఫ్‌ది సినిఇండ‌స్ట్రీ అయ్యింది. డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్‌ప్యాల‌స్‌లో ఐదురోజుల నిహారిక పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. మెగా హీరోలంద‌రూ పాల్గొన్న ఈవేడుక అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కాగా వ‌రుణ్ వివాహంపై తండ్రి నాగ‌బాబు స్వ‌యంగా స్పందించారు. వ‌రుణ్ ప్రేమ వివాహం చేసుకుంటారా లేక పెద్ద‌ల కుదిర్చిన వివాహం చేసుకుంటారా.. అని యాంక‌ర్ అడుగ‌గా.దానికి నాగ‌బాబు అది త‌న ఇష్టంపై ఆధార‌ప‌డి ఉంటుంది. మేము అమ్మాయి అన్ని విధాలా వ‌రుణ్‌కి స‌రిజోడి కాదా అన్న‌దే చూస్తాం. అమ్మాయి మంచిదైతే చాలు ప్రేమ వివాహ‌మా, పెద్దలు కుదిర్చిందా అనే ప‌ట్టింపులు లేవు అన్నారు. అయితే వ‌రుణ్ పెళ్లి ఎప్పుడు అనే సంగ‌తిపై స్ప‌ష్ట‌త మాత్రం ఇవ్వ‌లేదు. ఆయ‌న ఇప్పుడు వ‌రుణ్ బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌గ‌ని సినిమాలో న‌టిస్తున్నారు. వ‌రుణ్ బ‌ర్త్‌డే నాడు విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ ఆక‌ట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *