షూటింగ్ కు చేర్రీ కొన్ని రోజులు బ్రేక్‌…

ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ ,జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్ మొన్నిటి వ‌ర‌కు కూడా ట్రిపుల్ ఆర్ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. రామ్‌చ‌ర‌ణ్.50 రోజుల‌భారీ షెడ్యూల్ కూడా తాజాగాపూర్తి చెస్తాడు.మొన్నటికి మొన్న ఎన్టీఆర్‌కూడా కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని కుటుంబంతో పాటు దుబాయ్ వెళ్లోచ్చాడు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ కూడా కొన్ని రోజులు బ్రేక్ కావాలంటున్నాడు. అయితే ఎన్టీఆర్ మాదిరి బ‌య‌ట‌కి వెళ్ల‌డానికి కాదు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోబ్రేక్ కావాల‌ని రాజ‌మౌళికి అర్థీ పెట్టుకున్నాడు. రామ్ చ‌ర‌ణ్‌ ఆ ప‌ర్స‌న‌ల్ రీజ‌న్ ఏంటో అంద‌రికీ తెలుసు. డిసెంబ‌ర్‌9న రామ్‌చ‌ర‌ణ్ చెల్లెలు నిహారిక పెళ్లి. రాజ‌స్థాన్‌ ఉద‌య్‌పూర్ కోట‌లో అంగ‌రంగ వైభవంగా నిహారిక పెళ్లి వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి ఇండ‌స్ట్రీ నుంచి చాలా త‌క్కువ మంది రానున్నారు. ప్యాండ‌మిక్ కావ‌డంతో ఎవ‌రికీ ప‌త్రిక‌లు అయిత అంద‌లేద‌నే తెలుస్తుంది. హైద‌రాబాద్ వ‌చ్చిన త‌రువాత ప‌రిస్థితులు అన్నీ చ‌క్క‌బ‌డ్డాక పెద్ద పార్టీ చేసుకుందామ‌ని మెగా కుటుంబం స‌భ్యులు అంద‌రికీ చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. పెళ్లికి మాత్రం చాలా త‌క్కువ మంది హాజ‌రు కానున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం వారం రోజులు పైగా రామ్‌చ‌ర‌ణ్ సెల‌వు కోరిన‌ట్లు తెలుస్తుంది. రాజ‌మౌళి కూడా దీనికి అనుమ‌తి ఇచ్చేసాడు. డిసెంబ‌ర్ 9నే పెళ్లి కావ‌డంతో అన్న‌గా చేయాల్సిన బాధ్య‌తలు అన్నీ ద‌గ్గ‌రుండి చేస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్‌. మ‌రోవైపు వ‌రుణ్‌తేజ్ కూడా ప్ర‌స్తుతం నిహారిక పెళ్లి ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు.‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *