సీటీమార్ సెట్‌లో త‌మ‌న్నా పుట్టిన రోజులు వేడుకులు….

Celebrate ,Tamanna’s ,birthdays, on, the, Citymar set టాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్ దిగంగ‌న సూర్య‌వంశీ హీరోయిన్‌గా న‌టిస్తున్న మూవీ సీటీమార్‌.భారీ బ‌డ్జెట్‌,హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో వ‌ప‌న్‌కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌నివాసా సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీ‌నివాసా చిట్టూరి ఈ మూవీన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గాజ్వాలారెడ్డి గా న‌టిస్తున్న స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా పుట్టిన రోజు డిసెంబ‌ర్ 21. ఈ సంద‌ర్బంగా సీటీమార్ సెట్‌లో త‌మ‌న్నా పుట్టిన రోజు వేడుక‌లు గ్రాండ్‌గా జ‌రిగాయి. యూనిట్ సభ్యుల న‌డుమ కేక్ క‌ట్ చేసి బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్నారు. త‌మ‌న్నా ఈకార్య‌క్ర‌మంలో ఎగ్రెసివ్‌స్టార్ గోపీంచ్‌, మాస్‌డైరెక్ట‌ర్ సంప‌త్ నంది, న‌టి భూమిక‌, మూవీ మూవీ నిర్మాత శ్రీ‌నివాస‌చిట్టూరి, స‌మర్ప‌కులు వ‌ప‌న్‌కుమార్‌, హీరోయిన్ దిగంగన సూర్య‌వంశీతో పాటు మూవీ యూనిట్ పాల్గొన్ని త‌మ‌న్నాకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల‌చేసిన గోపీచంద్‌,త‌మ‌న్నాల లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. సినిమా యూనిట్ ఈ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో హీరోయిన్ గా దిగంగ‌న న‌టిస్తుండ‌గా భూమిక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ‌మురిళి , రావుర‌మేష్‌,రెహ‌మాన్‌, బాలీవుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *