బ‌న్నీ స్టూడెంట్ లీడ‌ర్‌గా….

టాలీవుడ్ అగ్ర‌హీరో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌,అనే సాలిడ్ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇది ఇంకా లైన్‌లో ఉండ‌గానే బ‌న్నీ మ‌రో సంచ‌ల‌న ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసేసాడు. అదే బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో, ఇంకా టైటిల్ ఖ‌రారు. కానీఈ మూవీన్ని కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా ప్ర‌క‌టించ‌డంతో దానిపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే గ‌త కొన్ని రోజుల నుంచి ఈ మూవీపై కొన్ని ఆస‌క్తిక‌ర గాసిప్ వినిపిస్తుంది. అదే అల్లు అర్జున్ రోల్‌కు సంబంధించి ఈ మూవీలో బ‌న్నీ ఒక స్టూడెంట్ లీడ‌ర్ గాఫ‌స్ట్ హాఫ్ లోను అలాగే సెకండ్ హాఫ్‌లో ఒక పొలిటిష‌య‌న్ క‌నిపిస్తాడ‌ని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా ఈ మూవీన్ని కొర‌టాల ప‌వ‌ర్‌పుల్ పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తుంది.మ‌రి ఇవి ఎంత వ‌ర‌కు నిజ‌మో కాలమే నిర్ణ‌యించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *