ఇద్ద‌రు ఒకే ఫ్రేమ్‌లో….

టాలీవుడ్ హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌స్తుతానికి పాన్ ఇండియ‌న్ హీరోగా ఇండియ‌న్ మూవీన్నిజోరుగా దూక‌పోతున్నాడు.ఇక అలాగే మ‌గా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళితో చేస్తున్న రౌద్రం ర‌ణం రుధిరం తో పాన్ ఇండియ‌న్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెడీగా ఉన్నాడు. అయితే మ‌రి ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు పాన్ ఇండియ‌న్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో చిక్క‌డం వైర‌ల్‌గా మారింది.మ‌న టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు 50వ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా దాదాపు మ‌న టాలీవుడ్ అగ్ర‌హీరోలు అంతా అటెండ్ అయ్యారు. ఇదిలా ఉండ‌గా అంద‌రి ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మాత్రం చ‌ర‌ణ్ మ‌రియు ప్ర‌భాస్ లు దిగిన ఫోటో నిలిచింది. ప్ర‌స్తుతం ఇదే సోష‌ల్‌మీడియాలో కూడా యిట్టే వైర‌ల్ అయ్యిపోయింది. పైగా ట్వీట్ట‌ర్ ట్రెండ్స్ లోకి కూడా వ‌చ్చేసారు. ఈ ఇద్ద‌రినీ ఒకే ఫ్రేమ్‌లో చూపిన మూవీ ల‌వ‌ర్స్‌కు అయితే ఆనందానికి హ‌ద్దులు లేవు. మ‌రి అలాగే ఈ ఇద్ద‌రు మాస్ హీరోలు ఒక మూవీ క‌నుక చేస్తే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *