ప‌వ‌న్ మించిన స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా బాస్‌..

టాలీవుడ్ మెగా ఫ్యామిలీ అంటే ఒక క్రేజ్‌లో ఉన్న సంగ‌తి అంద‌రికి తెలిసిన‌ విష‌య‌మే.మెగా డాట‌ర్ నిహారిక అలాగే చైత‌న్య జొన్నల‌గ‌డ్డ వివాహం కావ‌డంతో నుంచే సంద‌డి మొద‌ల‌య్యిపోయింది. ఇక అలాగే ఊహించ‌ని అతిథి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అక్క‌డికి బ‌య‌ల‌దేర‌డం అలాగే మొత్తం మెగా హీరోలు కుటుంబం అంతా ఒకే ఫ్రేమ్ లో క‌నిపించ‌డంతో మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అయితే ఎప్పుడు కుటుంబ ఫంక్ష‌న్ల‌కు దాదాపు దూరంగా ఉండే ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కావ‌డం అట్రాక్ష‌న్ అయితే ప‌వ‌న్ ను మించిన స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా మెగా బ్ర‌ద‌ర్ బాస్ మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. అని చెప్పాలి. అక్క‌డ అంత‌మంది మెగా యువ హీరోలు అల్లు అర్జున్‌, చ‌ర‌ణ్‌, సాయితేజ్‌, వైష్ట‌ణ‌తేజ్‌లు ఉన్న‌ప్ప‌టికీ చిరు మాత్రం మరింత స్మార్ట్ అండ్ యంగ్‌గా క‌నిపించ‌డమే గ‌మ‌నార్హ‌. ఇప్పుడు ఈ ఫొటోలే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మొత్తానికి మాత్రం ఈఫొటోల‌తో మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *