ప‌వ‌ర్ పుల్ విల‌న్‌గా అధీరా పాత్ర‌లో బాలీవుడ్ స్టార్

ఇప్పుడు మ‌న ద‌క్షిణాది నుంచి వ‌స్తున్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీల్లో క‌న్న‌డ స్టార్ హీరో రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ కేజీయ‌ఫ్ చాప్ట‌ర్‌2 వీరి కాంబినేష‌న్‌లో అంతకు ముందు వ‌చ్చిన చాప్ట‌ర్ 1 దేశ వ్యాప్తంగా కానీ వినీ ఎరుగ‌ని రికార్డుల‌ను నెల‌కొల్పింది. దీనితో చాప్ట‌ర్ 2పై అన్ని భాష‌ల్లో కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కానీ ఈ మూవీ విష‌యంలో మాత్రం అభిమానులకు చాలా కాలం ఎదురు చూపులు త‌ప్ప‌లేదు. పైగా అర‌కొర అప్డేట్స్‌ను ఇస్తూ మేక‌ర్స్ షూటింగ్ ఈ క‌రోనా స‌మ‌యంలో ముగింపు ద‌శ‌లకు తీసుకొచ్చేసారు. ఇక దీనితో ఇప్పుడు ఒక సాలిడ్ అప్డేట్ ఇస్తున్నాం రెడీగా ఉండ‌మ‌ని అభిమానుల‌ను అలెర్ట్ చేస్తున్నారు. దానిని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీలే తెలిపారు. ఇన్నాళ్లు ఓపిక‌గా ఉన్న అభిమానుల‌కు థ్యాంక్స్ చెప్తూ ఈ వ‌చ్చే డిసెంబ‌ర్ 21న అంటే చాప్ట‌ర్ 1 విడుద‌ల కాబ‌డిన అదే తేదీన ఒక మాన్ట్స‌ర్ అప్డేట్‌ను ఇస్తున్న‌ట్టుగా తెలిపారు. డిసెంబ‌ర్ 21 న ఉద‌యం 10 గంట‌ల 8 నిమిషాల‌కు ఒక అదిరిపోయే ట్రీట్ ఉంద‌ని చెప్తున్నారు. మ‌రి అదేంటో తెలియాలి అంటే అప్ప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే. ఇక ఈ మూవీలో ప‌వ‌ర్ పుల్ విల‌న్‌గా అధీరా పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి మేక‌ర్స్ ఏ అప్టేట్‌ను రివీల్ చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *