బాలీవుడ్ లో రెండోమూవీ తీసేందుకు రెడీ -ప్ర‌భాస్

బాహుబ‌లీ మూవీ నుంచి ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అయిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆల్ ఇండియాస్టార్ అయిపోయాడు. అనేక భాష‌ల్లో ప్ర‌భాస్‌కు ఫ్యాన్‌పాలోంగ్ ఉంది. అందుకే ప్ర‌తి మూవీకి ప్యాన్ ఇండియా లెవ‌ల్ లో తీస్తున్నాడు. ఇప్ప‌టికే బాలీవుడ్ లో త‌న మొద‌టి మూవీని ఆదిపురుష్ గా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తీస్తున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో రెండో మూవీల‌ను తీసేందుకు రెడీ అవుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రెండో మూవీని చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే క‌థ‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. సిద్ధార్థ ఆనంద్ ఇప్ప‌టికే వార్‌తో స్టార్ డ‌మ్ తెచ్చుకున్నాడు. అయితే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ మూవీ కోసం భారీగా ఖ‌ర్చుపెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భాస్ తో చేయ‌బోతున్న మూవీని సిద్దార్థ్ ఆనంద్ వార్ ను మించిన యాక్ష‌న్ మూవీగా తీసేందుకు స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడ‌ట‌. ఈ మూవీలో మ‌రో స్టార్ కూడా ఉంటాడ‌ని తెలుస్తోంది. వారిద్ద‌రి మ‌ధ్య యుద్ధం ఉండే అవ‌కాశం ఉంది. అయితే ఆ స్టార్ ఎవ‌రో తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం చేస్తున్న స‌లార్‌, రాధేశ్యామ్‌, నాగ్ అశ్విన్ మూవీల‌ను వ‌చ్చే ఆరు నెల‌ల్లో కంప్లీట్ చేసి సిద్ధార్థ్ ఆనంద్ మూవీ చేస్తాడు ప్ర‌భాస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *