అమితాబ్ కూతురి పాత్ర‌లో ర‌ష్మిక‌…

ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరో స్టైలీష్‌స్టార్ అల్లుఅర్జున్, ర‌ష్మీక మంద‌న్న క‌లిసి న‌టిస్తున్నార‌ని తెలిసిన విష‌య‌మే. క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న పాన్ ఇండియా క‌థానాయిక‌గా పేరు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో అగ్ర నాయిక‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకున్న ఈ కూర్గ్ సుంద‌రి.. ప్ర‌స్తుతం హిందీ చిత్ర‌సీమ‌పై దృష్టి పెట్టింది. పీరియాడిక‌ల్‌పై స్పైథ్రిల్ల‌ర్,మిష‌న్ మ‌జ్ను, ద్వారా ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్లో అరంగేట్రం చేయ‌బోతున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ మ‌ల్హోత్రా క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ మూవీ తాలూకా ఫ‌స్ట్‌లుక్‌ను ఈ మ‌ధ్యే విడుద‌ల చేశారు. ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది లావుండ‌గా ర‌ష్మిక మంద‌న్న హిందీలో మ‌రో బంప‌రాఫ‌ర్‌ను ద‌క్కించుకుంది. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ స‌ర‌స‌న ఓ ముఖ్య పాత్ర‌లో ఆమె న‌టించ‌బోతున్న‌ది. ఈ మూవీన్ని వికాస్‌భ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తండ్రీకూతురు అనుబంధం నేప‌థ్యంలో ఈ మూవీ క‌థాంశం సాగుతుంద‌ని స‌మాచారం. ఇందులో అమితాబ్ కూతురి పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న తెలుగులో పుష్ప మూవీలో న‌టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *