బాలీవుడ్ బ్యూటీకి క‌రోనా పాజిటివ్‌….

ముంబై: ఇప్పుడు దేశం మొత్తం క‌రోనా క‌ర‌ళ‌న‌త్యంత చేస్తుంది. సామాన్య ప్ర‌జ‌ల‌నుండి సెల‌బ్రిట్స్‌ల వ‌ర‌కు ఎవ్వ‌రి వ‌ద‌ల‌డం లేదు. బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌కు కొవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. గ‌త కొన్ని రోజులుగా స్వ‌ల్పంగా అస్వ‌స్థ‌త‌, క‌ళ్లలో మంట‌గా అనిపిస్తుండ‌టంతో శుక్ర‌వారం ఆమె కొవిడ్ నిర్ధార‌న ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈరోజు ఉద‌యం వెల్ల‌డైన ఆ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో కంగ‌నా ర‌నౌత్ కు క‌రోనా పాజిటివ్ తేలింది. ఈ సంగ‌తిన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. కొవిడ్ సోక‌డంతో నేను సెల్ప్ క్వారెంటైన్‌లో ఉన్నా. కోవిడ్ వైర‌స్ నా శ‌రీరంలో పార్టీ చేసుకుంటున్న‌దే విష‌యం నాకు ఇప్ప‌టిదాకా తెలియ‌దు. ప్ర‌స్తుతం తెలిసిందిగా ఇక దాన్ని అంతం చేస్తా. మీరు కూడాదేనికి మీపై అజ‌మాయిషీ చేసేఅవ‌కాశం ఇవ్వొద్దు మీరు కొవిడ్కు భ‌య‌ప‌డ్డారంటే అది మిమ్మ‌ల్ని మ‌రింత భ‌య‌పెడుతుంది. క‌రోనా వైర‌స్‌ కూడా ఒక చిన్న ప్లూ లాంటిదే. కొంచెం ఇబ్బంది పెట్టినా అదే త‌గ్గిపోతుంది. హ‌ర్ హ‌ర్ మ‌హ‌దేవ్ అని కంగ‌నా త‌న పోస్ట్ లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *