స్టైలిష్ స్టార్ త‌న ఫేవ‌రెట్ హీరో అంటున్నా బాలీవుడ్ న‌టుడు…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అయితే నార్త్ లో బన్నీ కు మైండ్ బ్లోయింగ్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ఫాలోయింగ్ ఒక్క నార్మల్ ఫ్యాన్స్ లోనే కాకుండా పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా బన్నీ డాన్సుల కోసం స్పెషల్ గా మెన్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి.అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో నటుడు బన్నీ తన ఫేవరెట్ హీరో అని అంటున్నాడు. అతడే అక్కడి సెన్సేషనల్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ చిత్రం “పరుగు” రీమేక్ తో బాలీవుడ్ లో మొదటి సినిమా చేసి ఇప్పుడు అక్కడ స్టార్ హీరోగా మారాడు.మరి అతడికి మన టాలీవుడ్ నుంచి అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే ఫేవరెట్ అని తన సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చాడు. అంతే కాకుండా బన్నీ లానే తాను కూడా నడవాలి అనుకుంటున్నాని తెలిపాడు. దీనితో బన్నీ ఫాలోవర్స్ లో మరో బాలీవుడ్ హీరో యాడ్ అయ్యాడని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *