కామ్రేడ్ భార‌త‌క్క రోల్‌లో ప్రియ‌మ‌ణి…

ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో రానా -సాయిప‌ల్లవి జంట‌గా న‌టిస్తున్న‌మూవీ విరాట‌ప‌ర్వం. వేణూ ఊడుగుల డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో రీస్టార్ట్ కానుంద‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజా అప్ డేట్ ప్ర‌కారం ఫారెస్ట్ లో విరాట‌ప‌ర్వం షూటింగ్ నేడు మొద‌లైంది. ప్ర‌స్తుతం మొద‌లుపెట్టిన షెడ్యూల్ షూటింగ్ పార్టు దాదాపు పూర్తి చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట డైరెక్ట‌ర్ వేణు అండ్ టీం. ఈ మూవీలో ప్రియ‌మ‌ణి, జ‌రీనా వ‌హాబ్‌, నందితాదాస్; ఈశ్వ‌రీ రావు ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. 1980బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా వ‌స్తోన్న ఈ మూవీలో ప్రియ‌మ‌ణి కామ్రేడ్ భార‌త‌క్క రోల్‌లో క‌నిపించ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *