బాల‌య్య కొత్త మూవీప్రాజెక్ట్ మ‌రో ద‌ర్శ‌కుడితో …

టాలీవుడ్ లెజెండ్ హీరో బాల‌కృష్ణ , బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లోవ‌స్తున్న మూవీ అఖండ విష‌యం తెలిసిందే. మ‌రో రెండు సాలిడ్ బిగేస్ట్ ప్రాజెక్ట్స్ కూడా బాల‌కృష్ణ లైన్ లో పెట్టేసారు. మ‌రి అలా సెట్ట‌యిన మూవీలో ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడితో ప్లాన్ చేసిన మూవీ కూడా ఒక‌టి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై గ‌త కొన్ని రోజుల నుండి ఓ ఆస‌క్తిక‌ర టాక్ ఉంది. మ‌రి దానిపైనే అనీల్ లేటెస్ట్ ఇంట‌ర్వూ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇది ఎలాంటి మ‌ల్టీ స్టార‌ర్ మూవీ కాద‌ని ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా పూర్తయ్యిపోయింద‌ని అంతే కాకుండా అది పూర్తిగా డిఫ‌రెంట్ జాన‌ర్ అని అనీల్ క్లారిటీ ఇచ్చారు. దీనితో ఎప్ప‌టి నుంచో మ‌ల్టీస్టార‌ర్ అన్న రూమ‌ర్‌కు ద‌ర్శ‌కుడు చెక్ పెట్టేసిన‌ట్టే అని చెప్పాలి. మ‌రి ఈప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లు అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *