కొవిడ్ సెకండ్ వేవ్ కు హీరోయిన్‌ ఆర్థిక‌సాయం…

ఇప్పుడు కొవిడ్ మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తిచెంది, ప్ర‌జ‌లను నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రాణాల‌ను కోల్పోతున్నారు. కేర‌ళ రాష్ట్ర విష‌యానికి వ‌స్తే అక్క‌డ క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఆసుప‌త్రుల్లో బెడ్లు, ఆక్సిజ‌న్ కొర‌తతోప్ర‌జ‌లు క‌న్నుమూస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌బ‌డ‌టానికి సినీ న‌టులు, రాజ‌కీయ నాయ‌కులు ముందుకు వ‌స్తున్నారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళాల‌ను అందిస్తున్నారు. ఈ సంద‌ర్బంలో టాలీవుడ్‌కు సుప‌రిచితురాలైన మ‌ల‌యాళీ హీరోయిన్ అనుప‌మ‌ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న వంతుగా విరాళాన్ని అందించారు. అయితే ఆమె ఎంత విరాళం అందించిందో చెప్ప‌లేదు. నేను నా బాధ్య‌త‌ను పూర్తి చేశాను. మీరు కూడా సాయం చేయండి అంటూ అనుప‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *