నాని మూవీ కోసం మ‌రో హీరోయిన్‌….

టాలీవుడ్ యంగ్ హీరో నాని ఇన్నాళ్లు ఎక్కువుగా చిన్న స్పాన్ ఉన్న మూవీల‌ను, సాదాసీదా నేప‌థ్య‌మున్న క‌థ‌ల‌ను చూజ్ చేసుకుంటూ వెళ్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఇక నుండి నాని చేయ‌బోయే క‌థ‌ల‌కు పెద్ద స‌స్పాన్ ఉండాల‌ని ఆశ‌ప‌డుతున్నార‌ట‌. అలా ఆలోచించే శ్యామ్ సింగ రాయ్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఇది క‌ల‌కత్తా నేప‌థ్యంలో జ‌రిగే క‌థ ఆట‌. టాక్సీవాలా మూవీతో ద‌ర్శ‌కుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాన్ ఈ మూవీన్ని డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఇందులో నాని మెచ్యూర్ రోల్ చేయ‌బోతున్నారు. క‌థ పెద్ద‌ది కావ‌డం వ‌ల‌న స‌బ్‌ప్లాట్స్ ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. అందుకే క‌థ‌నాయిక‌లు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో మొదటి ఇద్ద‌రు హీరోయిన్ల పేర్ల‌ను అనౌన్స్ చేశాడు. వారే సాయి ప‌ల్ల‌వి,కృతిశెట్టి. వీరిద్ద‌రూ కాకుండా ఇంకొక హీరోయిన్ కోసం కూడా చూస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ పాత్ర కోసం నివేత‌పేతురాజ్‌, అదితిరామ్‌హైద‌రి, నివేతా థామ‌స్ లాంటి హీరోయిన్ల పేర్లు విన‌బ‌డుతున్నాయి. మ‌రి చూడాలి ఎవ‌ర్ని తీసుకుంటారో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *