పుష్ప మూవీకి నో చెప్పిన అన‌సూయ‌…..

టాలీవుడ్ మూవీ ఇండ‌స్ట్రీలో అటు యాంక‌ర్‌గా ఇటు న‌టిగా దూసుకుపోతున్న‌ది. ఎవ‌రైనా ఉన్నారా అంటే అది అన‌సూయ మాత్ర‌మే. యాంక‌ర్ సుమ కూడా కేవ‌లం బుల్లితెర‌పై మాత్ర‌మే సంద‌డి చేస్తున్న‌ది.కానీ, అన‌సూయ మాత్రం త‌న‌కు త‌గిన పాత్ర‌లు వ‌చ్చిన‌ప్పుడు ఖ‌చ్చితంగా న‌టిస్తూనే ఉంది.
ఇప్ప‌టికే తెలుగులో కొన్ని మూవీల‌తో అన‌సూయ‌కు మంచి న‌టిగా కూడా గుర్తింపు వ‌చ్చింది. తాజాగా అన‌సూయ మోగా హీరో అల్లుఅర్జున్ మూవీతో న‌టించ‌డానికి నో చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. త‌న‌కుయ రంగ‌స్థ‌లం లాంటి మూవీతో స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుకుమార్ అడిగినా కూడా నో చెప్పింద‌ని వార్తలొస్తున్నాయి. ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల్లో న‌టిస్తోన్న అన‌సూయ చాలా బిజీగా ఉంది. తెలుగులో కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రంగ మార్తాండ‌తో పాటు చిరంజీవి ఆచార్య ర‌వితేజ, ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ లో వ‌స్తున్న కిలాడి మూవీల‌లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ది. ఇప్పుడు వీటితో పాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న పుష్ప మూవీలో కూడా కీల‌క‌మైన పాత్ర కోసం అనసూయ‌ను అడిగిన‌ట్లు స‌మాచారం.రంగ‌మ్మ‌త్త పాత్ర‌కు న్యాయం చేసిన ఈమెకు సుకుమార్ మ‌ళ్లీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. ఈ మూవీ ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. మూవీలో అల్లు అర్జున్ స‌హా ర‌ష్మిక మంద‌న్న‌, మిలిగిన వాళ్లు కూడా మేక‌ప్ లేకుండానే డీ గ్లామ‌ర‌స్ గా న‌టిస్తున్నారు. ఇందులో క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర కోసం అన‌సూయ‌ను అడిగితే నో చెప్పిన‌ట్లు తెలుస్తుంది. దానికి కార‌ణం మేక‌ప్ లేకుండా న‌టించ‌మ‌ని కోర‌డ‌మే. త‌న‌కు అలాంటి డీ గ్లామ‌ర్ రోల్ చేయ‌డం ఇష్టం లేక‌పోవ‌డంతో ఈ ఆఫ‌ర్‌కు నో చెప్పింద‌ని తెలుస్తోంది. తాజాగా విజ‌య్‌సేతుప‌తి హీరోగా న‌టిస్తున్న ఓ త‌మిళ మూవీలో అన‌సూయ న‌టించ‌బోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *