చిరు కోసం ఒక పుల్ ఎంట‌ర్ టైన్మెంట్‌తో సాగే క‌థ‌….

టాలీవుడ్ అగ్ర‌హీరో చిరంజీవి త‌న కంటూ ప్ర‌త్యేక ను సంత‌రించుకున్న విష‌యం తెసిలిసిందే. మెగాస్టార్ చిరు రీ ఎంట్రీ ఇస్తూ వ‌రుస మూవీలు ఒప్పుకుంటున్న నేప‌థ్యంలో చాలామంది డైరెక్ట‌ర్లు మెగాస్టార్ కోసం కొత్త క‌థ‌లు రాయ‌డం మొద‌లెట్టార‌ట‌. ఇప్ప‌టికే చిరుకు కొంత‌మంది లైన్స్ కూడా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. యంగ్ డైరెక్ట‌ర్ వెంకీకుడుముల కూడా చిరు కోసం ఒక పుల్ ఎంట‌ర్ టైన్మెంట్‌తోసాగే క‌థ‌ను రాశాడ‌ని తెలుస్తోంది. కాగా ఎలాగూ మెగాస్టార్ కంటిన్యూగా మూవీలు చేసుకుంటూ పోతున్నారు. కాబ‌ట్టి, త‌న క‌థ‌ను ఓకే చేస్తాడ‌నే వెంకీ ఆశ ప‌డుతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే మెగాస్టార్ కి వెంకీ కుడుముల క‌థ చెప్ప‌నున్నాడ‌ట‌. మ‌రి చూడాలి వెంకీ క‌థ‌… మెగాస్టార్ న‌చ్చుతుందో లేదో.. ఇప్పుడు చిరు ఆచార్య‌లో పాటు మోహ‌ర్ ర‌మేష్ మూవీన్ని చేస్తున్నారు. అలాగే మ‌ల‌యాళంలో లూసిఫ‌ర్ అనే మూవీ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ మూవీ మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *