అమితాబ్ స‌రికొత్త రీతిలో న‌టిస్తున్నాడ‌ట‌.. …

బాలీవుడ్ అగ్ర‌హీరో అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న బాలీవుడ్ మూవీ మేడే అయితే ఈ మూవీకి ద‌ర్శ‌కుడు, నిర్మాత అజ‌య్ దేవ‌గ‌ణ్ ఒక్క‌డే కావ‌డం ఓ విశేషం కాగా, తొలిసారి ఆయ‌న అమితాబ్‌బచ్చ‌న్ మూవీన్ని ద‌ర్శ‌క‌త్వంవ‌హిస్తున్నారు. అయితే ఏడు సంవ‌త్ప‌రాల త‌రువాత ఈ స్టార్ హీరోలిద్ద‌రూ క‌లిసి చేస్తున్న మూవీ విశేషం. అజ‌య్‌దేవ‌గ‌ణ్ ఎఫ్ ఫిల్మ్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న ఈ మూవీలో అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఈ మూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, అంగీరా ధార్ క‌థానాయిక‌లుగా ఉన్నారు. అయితే నేడు ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో ప్రారంభ‌మ‌య్యాయి. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ఈ రోజే మొద‌ల‌య్యింది. అయితే తొలి స‌న్నివేశానికి అజ‌య్ దేవ‌గ‌ణ్ స్నేహితుడు, ప్ర‌ముఖ తెలుగు జోతిష్యులు బాలు మున్నంగి క్లాస్ ఇచ్చారు. ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తానాజీ మూవీన్ని సైతం ఆయ‌నే క్లాప్ ఇచ్చారు. ఆ సెంటిమెంట్ ఇక్క‌డ కూడా వ‌ర్కౌట్ అవుతుంద‌ని ఆశిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ రోజు మేడే మూవీన్ని అధికారంగా ప్రారంభించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లో పూర్తిచేస్తామ‌ని అన్నారు. అయితే భ‌గ‌వంతుడితోపాటు మా త‌ల్లిదండ్రుల ఆశీర్వాదం కోరుకుంటున్నాన‌ని, నా కుటుంబ స‌భ్య‌లు, శ్రేయోభిలాషులు, అభిమానుల మ‌ద్ద‌తుతోపూర్తి చేస్తామ‌ని అన్నారు.అలాగే ఏప్రిల్ 29,2022 న ఈ మూవీన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *