ప‌ర్యావ‌ర‌ణ దినోత్సం సంద‌ర్భంగా మొక్క నాటిన అల్లుఅర్జున్‌…

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పుష్పమూవీలోన‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 5ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సం పుర‌ష్క‌రించుకొని అల్లుఅర్జున్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్క‌ను నాటిన ఫొటో షేర్ చేస్తూ ఈ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం రోజున ప్ర‌తిఒక్క‌రు ఎక్కువ మొక్క‌లు నాటుదాం అని ప్ర‌తిజ్ఞ చేద్దాం. రానున్న త‌రాల వారికి కూడా ఆకుపచ్చ‌గా ఉండే భూమిని ఇచ్చే ప్ర‌య‌త్నం చేద్ధాం అని అన్నారు. అలాగే మొక్క‌ల‌ను నాటిన ఫొటోలు త‌న‌కు షేర్ చేస్తే వాటిని రీషేర్ చేస్తాన‌ని అన్నారు. బ‌న్నీ.ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత‌వ్సం జూన్ 5 నేప‌థ్యంలోగా మూవీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన సెల‌బ్రిటీస్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా జ‌నాల‌లో అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొక్క‌ల్ని కాపాడాలి, చెట్ల‌ను పెంచాలి.అడువుల్ని డెవ‌ల‌ప్ చెయ్యాలి. అంటూ స‌ల‌హాలు ఇస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం నేప‌థ్యంగా మ‌నం ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను పునురుద్ద‌రించుకుందామ‌ని ప్ర‌తిజ్ఞ చేద్దాం. మ‌న భూగ్ర‌హాన్ని ప‌చ్చ‌గా ఉండే ప్ర‌య‌త్నం చేద్ధాం అని మ‌హేష్ త‌న ట్వీట్ లోపేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *