పుష్ప మూవీలో ఓ స్పెష‌ల్ సాంగ్‌…

టాలీవుడ్ అగ్ర‌హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రానున్న పుష్ప మూవీలో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌వి రౌటెలాను తీసుకున్నారు. ఈ సాంగ్ జాన‌ప‌ద నేప‌థ్యంలో సాగుతుంద‌ని… ప‌క్కా మాస్ అంశాలు ఈ సాంగ్‌లో ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌటెలాను తీసుకోబోతున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. కాగాస్టార్ కంపోజ‌ర్ దేవిశ్రీ ఇప్పటికే ఈ మూవీ కోసం ఈ పాట‌ను కూడా రికార్డ్ చేశార‌ట‌. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ ఈసారి కూల్ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప మూవీన్ని ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా సుక్కు, దేవి కాంబినేష‌న్‌లో ఐటం సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప మూవీ కోసం ప్రిపేర్ చేసే ఐట‌మ్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌ను ఏ రేంజ్‌లో ఊపేస్తుందో చూడాలి. అల వైకుంఠ‌పురంలో లాంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత బ‌న్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *