పుష్ప మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది..

టాలీవుడ్ అగ్ర‌హీరో అల్లు అర్జున్,ర‌ష్మికా మంద‌న్నా కాంబినేష‌న్ వ‌స్తున్న మూవీ పుష్ప అంద‌రికి తెలిసిన విష‌య‌మే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే అవుట్ అండ్ మాస్ పాన్ ఇండియ‌న్ మూవీ తెర‌కెక్క‌కుతున్న విష‌యం తెలిసిందే. అలాగే ఈభారీ మూవీ కూడా ఈమ‌ధ్య‌కాలంలో ఓరిలీజ్ డేట్ ను కూడా తెచ్చేసుకుంది. మ‌రి ఇదిలా ఉండ‌గా ఈ మూవీకి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌నే ర‌ష్మికా మంద‌న్నా వెల్ల‌డించింది. ఓ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పుష్ప మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అని షూట్ ఉద‌యం 5గంట‌ల‌కు అలా మొద‌ల‌యితే సాయంత్రం ఏడు ఏడున్న‌ర‌కి అలా పూర్తి చేస్తున్నామ‌ని తెలిపింది. అలాగే మేక‌ప్ విష‌యంలో కూడా ఒక రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది అని చెప్పింది. అయితే ఈషూట్‌లో మాత్రం తాము చాలా క‌ష్ట‌ప‌డుతున్న‌మ‌ని ఆ క‌ష్టం అంతా మాత్రం ఆ రోజు షూట్ అయ్యాక ఫైన‌ల్‌ చూసుకునే అవుట్ లో చూసి దానికి తాము ప‌డ్డ క‌ష్టం ఎటు వృధా పోలేద‌న్న న‌మ్మ‌కం వ‌స్తుంది అని తెలిపింది. దీనితో పుష్ప కోసం వీరు ఏరేంజ్ లో క‌ష్ట‌ప‌డుతున్నారో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ భారీ మూవికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా మైత్రి మూవీ మేక‌ర్స్ వారి భారీ బ‌డ్జెట్ తో నిర్మాణం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *