అల్లు అర్జున్ తో మూవీ చేయ‌డానికి లైన‌ప్‌లో మ‌రోద‌ర్శ‌కుడు…

టాలీవుడ్ అగ్ర‌హీరో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ద‌ర్శ‌కుడు సుకుమార్ తో భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి అలాగే ఈ మూవీ అనంత‌రం బ‌న్నీ చెయ్య‌బోతున్న ప్రాజెక్ట్స్‌కు సంబంధించి కూడా టాక్ ఆల్రెడీ మొద‌ల‌య్యింది. అయితే ఇప్ప‌టికే సెన్సేష‌న‌ల్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ మ‌రియు త‌మిళ్ ద‌ర్శ‌కుడు ఏ ఆర్ మురుగ‌దాస్ పేరు కూడా వినిపించింది. కానీ లేటెస్ట్ గా మ‌న టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి పేరుకూడా వ‌చ్చింద‌ని రూమర్స్ మొద‌ల‌య్యాయి. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సిఉంది. ఈ మ‌ధ్య వంశీ పేరిట చాలానే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏది నిజ‌మవుతుందో అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇప్పుడు అయితే బ‌న్నీ త‌న క‌రోనా రెస్ట్ లో ఉన్నారు. దాని త‌రువాత వెంట‌నే మ‌ళ్ళీ పుష్ప షూట్ లో బిజీ కానున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *