హ‌లీడే టూర్ దుబాయిలో అర్జున్ ఫ్యామిలీ …..

టాలీవుడ్ అగ్ర‌హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూవీ పుష్ప విష‌యం తెలిసిందే.ఇప్పుడు పుష్ప మూవీకి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. గ‌త కొద్ది రోజులుగా పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ హాలీడే టూర్‌లో భాగంగా దుబాయ్‌కు వెళ్లారు. అక్క‌డ త‌న భార్య స్నేహారెడ్డి, పిల్ల‌లు అయాన్‌, అర్హ‌తో క‌లిసి స‌ర‌దాగా గడుపుతున్నాడు. దుబాయ్‌లోని ఫేమ‌స్ థీమ్ పార్క్‌ను సంద‌ర్భించిన బన్నీ ఫ్యామిలీ అక్క‌డ పిల్ల‌ల‌తో ప‌లు గేమ్స్ ఆడిస్తూ క‌నిపించాడు. చిల్డ్ర‌న్స్ ప్లే మ్యూజియం ఎయిర్ గ్యాల‌రీలో అర్హ‌ను ఆడిస్తూ ఉన్న వీడియోను స్నేహారెడ్డి త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేయ‌గా,ఇది వైర‌ల్ గా మారింది. కాగా, ఇదివ‌ర‌కే మ‌హేష్ బాబు, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హాలీడేటూర్‌లో భాగంగా దుబాయ్‌కువెళ్ళిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో కేర‌ళ షెడ్యూల్‌కు ప‌య‌నం కానుండ‌గా, ఆ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌న్న‌ట్టు తెలుస్తుంది. ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఆగ‌స్టు13 న ఈ మూవీన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *