అల్లుఅర్జున్‌కు ఐకానిక్ మాస్ స్టార్ అనే లేటెస్ట్ ట్యాగ్ ముద్ర…

అల్లు అర్జున్‌,ఇంటెలిజెంట్ ద‌ర్శ‌కుడు సుకుమార్ క‌ల‌యిక‌లో వ‌స్తున్నా స‌రికొత్త‌గా పాన్ ఇండియ‌న్ సినిమా పుష్ప విష‌యం తెలిసిందే.సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. అయితే త‌న ప్ర‌తీ మూవీకి కూడా లేటెస్ట్ మేకోవ‌ర్‌లో ద‌ర్శ‌నం ఇచ్చే స్టైలిష్‌స్టార్ పుష్ప తో ఊహించ‌ని మేకోవ‌ర్ లో క‌నిపించి షాకిచ్చాడు. చాలా ర‌ఫ్ లుక్‌లో క‌నిపించి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో అద‌ర‌గొట్టిన బ‌న్నీ ప్ర‌స్తుతం త‌న ట్యాగ్ మార్చుకునే స‌మ‌యం వ‌చ్చేసింద‌ని డైరెక్ట‌ర్ సుకుమార్ అంటున్నారు. నిన్న కార్తికేయ హీరోగా లావ‌ణ్యాత్రిపాఠి హీరోయిన్ గా న‌టించిన లేటెస్ట్ మూవీ చావు క‌బురు చ‌ల్ల‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో క‌నిపించిన సుకుమార్ ఇదే అన్నారు. పుష్ప త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనే ట్యాగ్ నుంచి ఐకానిక్ మాస్ స్టార్ అనే లేటెస్ట్ ట్యాగ్ ముద్ర ప‌డిప‌తుంద‌ని హామి ఇచ్చారు. మ‌రి దీనిని బ‌ట్టి వీరు ఈ మూవీ అవుట్ పుట్ విష‌యంలో ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ మూవీకి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *