అల్లు అర్జున్ మూవీ ఆల్ టైమ్ రికార్డునే సెట్ చేసింది…

ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ చేస్తున్నా విష‌యం తెలిసిందే. మాట‌ల‌మాంత్రికుడు మ‌రియు అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూవీ అల వైకుంఠ‌పుర‌ములో మూవీ ఇంకో కొన్ని రోజుల ఉంటే ఏడాది పూర్త‌యిపోతుంది. ఏడాది ఉన్న దాని హ‌వా మాత్ర‌ము ఇప్ప‌టికి ఏదొక కేట‌గిరీలో కొనసాగుతూనేఉంది.ముఖ్యంగా అయితే ఈ మూవీన్ని బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచిన సంగీతం ఎన్నో వండ‌ర్స్ న‌మోదు చేసింది. యూట్యూబ్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ వ‌ర‌కు సంచ‌ల‌న రికార్డుల‌ను న‌మోదు చేసిన ఈ మూవీ లేటెస్ట్ గా మ‌రో రెండు ఫీట్స్‌ను అందుకుంది. దిగ్గ‌జ స్ట్రీమింగ్ సంస్థ అమెజ‌న్ ప్రైమ్ మ్యూజిక్‌లోఈ2020 సంవ‌త్స‌రంలో అత్య‌ధికంగా స్ట్రీమ్ చేయ‌బ‌డిన తెలుగు ఆల్బ‌మ్‌గా నెంబ‌ర్ 1 స్థానంలో నిల‌వ‌గా జియో సావ‌న్‌లో అయితే ఆల్‌టైం రికార్డునే సెట్ చేసిన‌ట్టుగా తెలుస్తుంది. దాన్ని స్వ‌యంగా ఈ మూవీ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ తెలిపాడు. జియో సావ‌న్ లో అల‌వైకుంఠ‌పుర‌ములో ఆల్బమ్ కుగాను ఏకం178.7 మిలియ‌న్ స్ట్రీమింగ్స్ తో సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డు నెల‌కొల్పిన‌ట్టు తెలిపారు. దీనితో బ‌న్నీ మూవీ సెన్సేష‌న్ ఇంకా ఆగ‌లేదు అని చెప్పి తీరాలి. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా గీతా ఆర్ట్స్ మ‌రియు హారికా హాసిని వారు సంయుక్తంగా నిర్మాణం వ‌హించిన సంగ‌తి తెల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *