తెలుగుతో కుస్తీలు ప‌డుతున్నా ఆలియాభ‌ట్‌..

Alia Bhatt wrestling with Telugu ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌రియు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్నా మూవీ ఆర్ ఆర్ ఆర్ అంద‌రికి తెలిసిన విష‌య‌మే.బిగ్గెస్ట్ యాక్ష‌న్ అండ్ పీరియాడిక్ డ్రామా రౌద్రం ర‌ణం రుధిరం ఇద్ద‌రు హీరోల‌తో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ భారీ మూవీపై ఎన‌లేని అంచనాలు నెల‌కొన్నాయి. అయితే ఈ సినిమాలో ఈ ప్ర‌ధాన లీడింగ్ కు ఇద్ద‌రు టాప్ మోస్ట్ హీరోయిన్స్ ను తీసుకున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ భామ ఆలియాభట్ ను రామ్ చ‌ర‌ణ్‌కు సీత‌గా రాజ‌మౌళి తీసుకొచ్చాడు. ఇటీవ‌లే ఆమెతో షూట్‌ను కూడా జ‌రిపిన విష‌యం తెలిసిందే.అలాగే ఆలియా త‌న మొట్ట మొద‌టి మూవీ అయిన దీనిలోత‌న తెలుగు డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈమె ఇందుకు స్పెష‌ల్ క్లాసుల‌ను కూడా తీసుకొంది. కానీ ఆమె తెలుగుతో ఏ రేంజ్‌లో కుస్తీలు ప‌డుతుంది అంటే.. నిద్ద‌ట్లో కూడా రాజ‌మౌళి త‌న‌కు ఇచ్చిన డైలాగ్ లైన‌ర్లు చెప్పుకుంటుంద‌ట‌. ఇంతేనా నిద్ర లేచి తినేట‌న‌ప్పుడు ఉద‌యం మ‌ధ్యాహ్నాం ,సాయంత్రం మూడు పూట్లా తెలుగు లైన్స్ తో కుస్తీ ప‌డుతుంద‌ట‌. అలాగే దాదాపు ఏడాదిన్న‌రా నుంచి త‌న డైలాగుల‌తో గ‌డుపుతున్నాన‌ని ఈ కొత్త ఎక్స్ పీరియ‌న్స్ చాలా భిన్నంగా ఉంద‌నిఆమె లేటెస్ట్‌గా ఇచ్చిన ఓఇంట‌ర్వ్యూలో తెలిపిన‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఆలియా డెబ్యూ ఎలా ఉంటుందో అని చాలా మందే ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *