బుట్టబొమ్మ రికార్డుకు డేవిడ్ వార్న‌ర్ క్రెడిట్ కూడా ఉంది..

టాలీవుడ్‌లో త‌నదైన ముద్ర‌వేసుకున్న స్టార్ అల్లు అర్జున్ ఆయ‌న న‌టించిన మూవీ అలవైకుంఠ‌పుర‌ములో త్రివ‌క్రమ్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో అల్లు అర్జుణ్ హీరోగా తెర‌కెక్కిన ఈ మూవీ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ అందించిన పాటు సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్ట‌బొమ్మ పాట‌, దానికి బ‌న్నీ వేసిన స్టెప్పులు ఇత‌ర భాష‌ల వాళ్ల‌ని అల‌రించాయి. బుట్ట‌బొమ్మ పాట అంత‌గా విజ‌య‌వంత‌మ‌డానికి ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ కూడా కార‌ణ‌మ‌ని బ‌న్నీ తాజాగా చెప్పాడు స‌మంత హోస్టింగ్ చేస్తున్న సామ్‌జామ్ షోలో బ‌న్నీ పాల్గొన్నాడు. కొత్త ఏడాదికి కానుక‌గా ఈ కార్య‌క్ర‌మం స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా బుట్ట‌బొమ్మ పాట గురించి బ‌న్నీ స్పందించాడు. ఆ పాట అంత స‌క్సెస్ కావ‌డంతో యూనిట్ స‌భ్యుల‌కు ఎంత క్రెడిట్ ఉందో అంతే స‌మాన‌మైన క్రెడిట్ వార్న‌ర్‌కు కూడా ఉంది. టిక్‌టాక్ ద్వారా ఆ పాట‌ను వార్న‌ర్ వైర‌ల్ చేశాడు. ఇటీవ‌ల జ‌రిగిన సిరీస్ సంద‌ర్భంగా స్టేడియంలో కూడా వార్న‌ర్ బుట్ట‌బొమ్మ స్టెప్ వేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని బ‌న్నీ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *