యూట్యూబ‌ర్‌పై అక్ష‌య్‌కుమార్ రూ.500కోట్ల ప‌రువున‌ష్టం దావా….

ముంబైః త‌న‌పై అస‌త్య వార్తా క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్న యూట్యూబ‌ర్‌పై బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య‌కుమార్ రూ.500 కోట్ల‌కు పరువున‌ష్టం దావా దాఖ‌లు చేశాడు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో ర‌షీద్ సిద్ధిఖీ అనే యూట్యూబ‌ర్ అక్ష‌య్ పేరును ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నాడు. సిద్ధిఖీ ఈ కేసులో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్‌థాక‌రే, ఆయ‌న కుమారుడు అదిత్యా థాక‌రే పేర్ల‌ను కూడా ప్రచారం చేశాడు. వీరితో పాటు ఇత‌ర ప్ర‌ముఖుల‌పై కూడా డిజిట‌ల‌ఖ మీడియా వేదిక‌ల‌ను ఉప‌యోగించుకుని సిద్దిఖీ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పంటించేలా అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తున్నాడు. ప‌లు సంద‌ర్భాల్లో తీసిన వీడియోల్లో అక్ష‌య్‌కుమార్ పేరును ప్ర‌స్తావించాడు. ఎంఎస్ ధోని, అది అన్‌టోల్డ్ స్టోరీ వంటి చిత్రాలు సుశాంత్ ద‌క్క‌డం అక్ష‌య్‌కు ఇష్టం లేద‌న్నారు. అదిత్యాథాక‌రేతో అదేవిధంగా ముంబై పోలీసుల‌తో అక్ష‌య్ ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హించిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేశాడు. సుశాంత్ గ‌ర్ల‌ఫ్రెండ్‌, న‌టిరేఖా చ‌క్ర‌వ‌ర్తితో సైతం అక్ష‌య్‌కు లింక్ అంట‌గ‌డుతూ ఆమె కెన‌డా పారిపోయేందుకు అక్ష‌య్ స‌హాయం చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు గుప్పించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *