డ్రైవ‌ర్ జ‌మున‌ పాత్ర‌లో ఐశ్వ‌ర్యారాజేష్

తెలుగింటి ఆడ‌ప‌డుచు ఐశ్వ‌ర్యారాజేష్ కు త‌మిళ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మ‌డు అక్క‌డ హీరోయిన్‌గా రాణిస్తూ ప‌లు మూవీల్లో న‌టించి అద‌ర‌గొట్టింది. తెలుగులోపెద్ద‌గా ఆద‌ర‌ణ లేకపోయినా త‌మిళ్‌లో మాత్రం మంచి రోల్స్ చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఐశ్వ‌ర్యరాజేష్ కెరీర్ ఆరంభంలో త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తితో క‌లిసి ర‌మ్మీ, ప‌న్నైర‌మ్ మూవీల్లో న‌టిచింది. ఇక ఈమ‌ధ్య‌కాలంలో తెలుగులో సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తో క‌లిసి న‌టిచింది వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వర్ మూవీలో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. కానీ త‌న న‌ట‌న‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. ఐశ్వ‌ర్య ఇప్పుడు మ‌రో వైవిధ్య‌మైన మూవీలో న‌టిస్తుంది. డ్రైవ‌ర్ జ‌మున అనే మూవీలో డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది ఐశ్వ‌ర్య . ఈ మూవీ పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల‌కానుంది. అందులో భాగంగా త‌మిళం, తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ మూవీన్ని త‌మిళ ద‌ర్శ‌కుడు
గిన్స్‌లిన్ తెర‌కెక్కించ‌నున్నాడు. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన ఒక యువ‌తి కాల్ ట్యాక్సి్ డ్రైవ‌ర్‌ అయ్యేందుకు ప‌డిన క‌ష్టాలు ,ఆమె అనుభ‌వాల‌ను ఇతివృత్తంగా ఈమూవీ తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. క్రైం థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో వ‌స్తున్న ఈ మూవీన్ని 18 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుండ‌గా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *