ఆదిపురుష్ షూటింగ్ ఇప్ప‌ట్లోలేన‌ట్టే…

ఇప్పుడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస మూవీల‌తో బిజీగా ఉన్నాడు అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఈ మ‌ధ్య‌కాలంలో రాధేశ్యామ్ పూర్తి చేశాడు. ఆదిపురుష్‌, స‌లార్, నాగ్ అశ్విన్ మూవీల‌ను లైన్లో పెట్టాడు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ మూవీషూటింగ్ ఈ మ‌ధ్య‌కాలంలో ప్రారంభ‌మైంది. అయితే తొలి రోజునే షూటింగ్ స్పాట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో షూటింగ్ నిలిచిపోయింది. భారీ జ‌డ్జెడ్‌తో 3డీ టెక్నాల‌జీతో ఆదిపురుష్ ను తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. షూటింగ్ స్పాట్ లో ప్ర‌మాదం కార‌ణంగా ఆధునిక సాంకేతిక ప‌రికాలు కాలిపోయాయ‌ట‌. మోష‌న్ క్యాప్చ‌న్ టెక్నాల‌జీతో ఈ మూవీను తెర‌కెక్కిస్తున్నారు.అగ్ని ప్ర‌మాదం కార‌ణంగా ఈటెక్నాల‌జీకి ఉప‌యోగించే సాంకేతిక ప‌రిక‌రాలు, భారీ సెట్, కాస్ట్యూమ్స్ అగ్నికి ఆహుత‌య్యాయ‌ట‌. సాంకేతిక ప‌రిక‌రాల‌ను మ‌ళ్లీ విదేశాల నుంచి తెప్పించాల్సి వుంద‌ట‌. అలాగే సెట్‌ను మ‌ళ్లీ మొద‌టి నుంచి నిర్మించాల‌ట‌.ఈ నేప‌థ్యంలో ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌ట్లో ప్రారంభం కాద‌ని తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి
కేట‌యించిన డేట్ల‌ను ప్ర‌భాస్ స‌లార్ కు స‌ర్దుబాటు చేసిన‌ట్టు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *