ఆదిపురుష్ ఈ షూట్ మ‌ళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి..

బాహుబాలీ గా ప్రపంచానికి ప‌రిచ‌యం అయిన యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పాన్ఇండియా స్టార్‌గా ప‌లు భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీల్లో ఆదిపురుష్ కూడా ఒక‌టి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ భారీ మూవీపై ఎన‌లేని అంచ‌నాలు కూడా ఉన్నాయి. మ‌రి ఇదిలా ఉండ‌గా గ‌త కొన్ని రోజుల నుంచి ముంబైలో ఈ మూవీ షూట్కు ప్ర‌భాస్ నిర్విరామంగా పాల్గొని మ‌ళ్ళీ హైద‌రాబాద్ కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే అయితే ఇప్పుడు అక్క‌డ మారుతున్న ప‌రిస్థితుల రీత్యా మూవీ యూనిట్ మిగ‌తా షూట్ ను అందాకా ఆపిన‌ట్టుగా రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. అక్క‌డ పెరుగుతున్న కొవిడ్ తీవ్ర‌త కారణంగా అన్ని మూవీల షూట్స్ అందాకా నిల‌పాల‌ని ప్ర‌భుత్వం గైడ్ లైన్స్ ఇవ్వ‌డంతో ఆదిపురుష్ ప్ర‌భాస్ లేని షూట్ ఆగిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఇప్ప‌టికే ప్ర‌భాస్ వ‌ర‌కు ప్లానింగ్ ప్ర‌కారం అనుకున్న షూట్ జ‌రిగిపోవ‌డం మంచిది అయ్యింది అని చెప్పాలి. మ‌రి ఈషూట్ మ‌ళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *