ఆదిపురుష్ పై తాజా అప్‌డేట్ ఇచ్చిన యంగ్ రెబ‌ల్ స్టార్‌…

టాలీవుడ్ అగ్ర‌హీరో పాన్ఇండియా స్టార్ అయిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా మూవీ ఆదిపురుష్‌.. బాలీవుడు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ రామాయ‌ణం క‌థాంశంతో రూపొంద‌నుంది. మూవీలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా, సైఫ్ అలీఖాన్ రావ‌ణానురుడి పాత్ర‌లో మెర‌వ‌నున్నారు. 3డీలో తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీలో గ్రాఫిక్స్ భారీ రేంజ్‌లో ఉండ‌నున్నాయి. ఈ క్ర‌మంలో గాఫిక్స్ కోస‌మే నిర్మాత‌లు 150 నుంచి 200 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 2022 ఆగ‌స్టు 11వ ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ మూవీకు సంబంధించి తాజాగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. జ‌న‌వ‌రి 19వ మోష‌న్ క్యాప్చ‌ర్‌తో ఆదిపురుష్ మూవీ మొద‌లు కానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ఈ మూవీ కోసం స‌రికొత్త టెక్నాల‌జీ ఉప‌యోగిస్తున్న‌ట్టు నిర్మాత‌లు భూష‌ణ్ కుమార్‌, కృష‌న్‌కుమార్ చెబుతున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో మూవీని చిత్రీక‌రించేందుకు ఓం అత‌ని టీం ప‌ని చేస్తున్నార‌ని, ఈ మూవీతో ఇండియ‌న్ మూవీ స్థాయి మ‌రింత పెరుగుతుంద‌ని స్ఫష్టం చేశారు. ఫిబ్ర‌వ‌రి2 నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *